నేను Google టోన్‌ను ఎలా ఉపయోగించాలి?
Google టోన్ ఉపయోగించి URLను ప్రసారం చేయడానికి:
- మీ Google ఖాతాకు లాగిన్ చేయండి.
- మీరు ప్రసారం చేయాలనుకుంటున్న వెబ్ పేజీలో ఉన్నప్పుడు మీ Chrome బ్రౌజర్‌లోని Google టోన్ చిహ్నాన్ని క్లిక్ చేయండి.
Google టోన్‌ను ఎందుకు ఉపయోగించాలి?
మనం ఒకరితో ఒకరం ఎలా మాట్లాడుకుంటామో అదే రీతిలో కంప్యూటర్‌ల మధ్య కమ్యూనికేషన్ జరగడానికి Google టోన్ సహాయపడుతుంది. ఇది ఒక బ్రౌజర్ పొడిగింపు, దీని సహాయంతో Chrome మీ కంప్యూటర్ స్పీకర్‌లను ఉపయోగించి ఇతర కంప్యూటర్‌ల మైక్రోఫోన్‌లకు URL వలె గుర్తించేలా ప్రత్యేక శబ్ద సంకేతాన్ని పంపుతుంది.
Google టోన్ ఎలా పని చేస్తుంది?
Google టోన్ మీ కంప్యూటర్ మైక్రోఫోన్‌ను (పొడిగింపు ఆన్‌లో ఉంటే) ఆన్ చేస్తుంది. Google టోన్ URLను తాత్కాలికంగా Google సర్వర్‌ల్లో నిల్వ చేసి, ఆపై మీ కంప్యూటర్ స్పీకర్‌లు మరియు మైక్రోఫోన్‌ను ఉపయోగించి దాన్ని ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయిన సమీప కంప్యూటర్‌లకు పంపుతుంది. వినబడేంత దూరంలో ఉన్న అలాగే Google టోన్ పొడిగింపు ఇన్‌స్టాల్ చేయబడి, ఆన్‌లో ఉన్న ఏ కంప్యూటర్ అయినా Google టోన్ నోటిఫికేషన్‌ను స్వీకరించగలదు. నోటిఫికేషన్‌లో URL దానితో పాటుగా మీ Google ప్రొఫైల్ పేరు మరియు చిత్రం చూపబడతాయి.
Google టోన్‌తో URLను స్వీకరించడానికి, Chromeకు మీ మైక్రోఫోన్ ఆన్‌లో ఉండటం అవసరం. రణగొణ ధ్వనులు వినిపించే ప్రదేశాల్లో ఉన్నా, బాగా దూరంగా ఉన్నా, ఇంటర్నెట్ కనెక్షన్ బలహీనంగా ఉన్నా లేదా మైక్రోఫోన్ లేని కంప్యూటర్‌లు ఉపయోగిస్తున్నా లేదా Google టోన్ ద్వారా అందించే ధ్వని ప్రసారాన్ని గుర్తించగల సామర్థ్యం లేని మైక్రోఫోన్ కలిగి ఉన్నా Google టోన్ పని చేయకపోవచ్చు.
Google టోన్ నా డేటాను ఎలా ఉపయోగిస్తుంది?
Google టోన్ Google గోప్యతా విధానం ప్రకారం అనామక వినియోగ డేటాను సేకరిస్తుంది.
నేను దీన్ని ఎలా ఆన్ చేయాలి మరియు ఆఫ్ చేయాలి?
Google టోన్ (మైక్రోఫోన్‌తో సహా) ఆన్ చేయడానికి మరియు ఆఫ్ చేయడానికి, Chrome పొడిగింపు సెట్టింగ్‌లకు వెళ్లండి.
ఇది సురక్షితమైనదేనా?
Google టోన్ కేవలం URLలను మాత్రమే ప్రసారం చేస్తుంది, కాబట్టి స్వీకర్తలు వారికి సాధారణంగా ప్రాప్యత ఉండని పేజీకి స్వయంచాలకంగా ప్రాప్యత పొందరు. ఉదాహరణకు, మీరు మీ Gmail ఇన్‌బాక్స్ URLను ప్రసారం చేస్తే, Google టోన్ నోటిఫికేషన్‌పై క్లిక్ చేసే స్వీకర్తలు వారి Gmailకి లాగిన్ చేయాలని ప్రేరేపించబడతారు. ఏదేమైనా, Google టోన్ ప్రసారాలు రూపకల్పన రీత్యా పబ్లిక్‌గా ఉపయోగించదగినవి, కాబట్టి గోప్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి వీటిని ఉపయోగించకుండా ఉండటమే మంచిది.